ధర్మపురికి బాజిరెడ్డి వార్నింగ్

by Shyam |
ధర్మపురికి బాజిరెడ్డి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ వైఫల్యాలపై తరచూ విమర్శలు చేసే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్న అర్వింద్‌ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. దుబ్బాకలో ఒక్క సీటు గెలిచి బీజేపీ నేతలు విర్రవీగడం సరికాదన్నారు. జరిగిన నష్టం పై అంచనా వేస్తామని కేటీఆర్ చెప్పినప్పటికీ ఏదో పెద్ద విజయం సాధించినట్టు తెలంగాణ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనికి తోడు రౌడీయిజం చేస్తున్నానని, హత్యలు చేయిస్తున్నట్టు బీజేపీ ఎంపీ ఆరోపణలను నిరూపించాలని బాజీరెడ్డి సవాల్ విసిరారు. తన పై అరవింద్ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేస్తామని బాజీరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story