- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేతనాలు చెల్లించండి.. మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో మిషన్ భగీరథ కార్మికులు మెరుపు సమ్మె ప్రారంభించారు. సోమవారం విధులు బహిష్కరించి పంపుహౌస్ ముందు కార్మికులు టెంట్ వేసి బైఠాయించారు. ఈ సమ్మెకు సీఐటీయూ నాయకత్వం వహించగా పర్ణశాల ఉపసర్పంచ్ వాగే ఖాదర్ బాబు వారికి మద్దతు తెలిపారు. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ కటింగ్స్ పోనూ రావాల్సిన రూ. 11600 వేతనం చెల్లించాలని, కానీ రూ. 7500లు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని, పని కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమ్మెలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె. బ్రహ్మచారి, సీఐటీయూ జిల్లా కోశాధికారి పద్మ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే కార్మికులు ఎలా పని చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. 2021 ఏప్రిల్ నెలలో డీఈ ఏసుబాబు రాతపూర్వకంగా కార్మికులకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి కూడా 9 నెలలు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. పక్క మండలాల్లో 11800 ప్రతి నెల ఇస్తున్నారని, ఈ మండలంలో ఎందుకు సాధ్యం కావట్లేదని అన్నారు. తక్షణమే అధికారులుస్పందించి మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మిషన్ భగీరథ కార్మికులు పాల్గొన్నారు.