- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జానారెడ్డి ఇంటికి కూడా భగీరథ నీళ్లు ఇస్తున్నాం’
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నిర్వహిస్తున్న కోటి వృక్షార్చనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి ఎర్రబెల్లి నివాసంలో వృక్షార్చన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ నెల 17న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కోటి మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. 2015లో ప్రారంభమైన హరితహారం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 230 కోట్ల మొక్కలు నాటామని, అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం 4 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. వృక్షార్చనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
జానారెడ్డి మాటల్లో వాస్తవం లేదు
తన స్వగ్రామమైన అనుములకు మిషన్ భగీరథ నీళ్లు రాలేదన్న కాంగ్రెస్‌నేత జానారెడ్డి మాటల్లో వాస్తవం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నల్లగొండ జిల్లాలో మూడేండ్ల నుంచి ప్రతి ఇంటికీ ‘భగీరథ’ నీళ్లు అందుతున్నాయని, జానారెడ్డి ఇంటికి సైతం మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి సాక్ష్యంగా వీడియోను వెల్లడించారు.