- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. లక్షలు వెచ్చించినా ఫలితం శూన్యం.. నిర్మల్ అధికారులపై ఆగ్రహం
X
దిశ, నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి నల్లాల ద్వారా నీరును అందించేందుకు మిషన్ భగీరథ పథకం నిర్వీర్యం అవుతుంది. దీంతో ప్రజలు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి నీరు అందించేందుకు రోడ్లను సైతం ధ్వంసం చేసి పైపులైన్ వేసినా నేటికీ నీరు రాకపోవడంతో ప్రజాధనం వృథా అయ్యిందని ప్రజలు అంటున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని నల్దుర్తి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు లక్షల రూపాయలు వెచ్చించి వాటర్ ట్యాంక్ నిర్మించినా నేటికీ ఉపయోగానికి రాకపోవడంతోపాటు నీటిని పైకి ఎక్కించే పైప్ లైన్ సరిగ్గా లేక పోవడంతో నీరు వృథాగా పారుతూ పంట పొలాల్లోకి వెళుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సరఫరా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story