నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

by Anukaran |   ( Updated:2020-10-26 06:51:32.0  )
నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ నేత నారా లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకివీడులో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన లోకేశ్.. స్వయంగా ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అది ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్తుండగా అంతా కిందకు దిగారు. ఇదే క్రమంలో ఇంజిన్ పక్కకు ఒరిగి ఆగిపోయింది. తర్వాత నారా లోకేశ్ నడుచుకుంటూనే పర్యటనను కొనసాగిస్తున్నారు. అయితే ఎవరికీ ఏం జరక్క పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story