ఎమ్మెల్యే రాజ‌య్య‌కు త‌ప్పిన ప్ర‌మాదం

by Anukaran |   ( Updated:2020-12-13 10:09:25.0  )
ఎమ్మెల్యే రాజ‌య్య‌కు త‌ప్పిన ప్ర‌మాదం
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య‌మంత్రి టీ.రాజ‌య్య‌కు తృటిలో ప్రాణాపాయం త‌ప్పింది. జ‌న‌గామ జిల్లా కేంద్రంలో జ‌రుగుతున్న ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ఆదివారం త‌న కారులో వెళ్తుండ‌గా ర‌ఘునాథ‌ప‌ల్లి వ‌ద్ద.. ముందు వెళ్తున్న పోలీస్ వాహ‌నానికి రెండు ఇసుక లారీలు అక‌స్మాత్తుగా ఎదురు వ‌చ్చాయి. దీంతో పోలీస్ వాహ‌నం డ్రైవ‌ర్ స‌డ‌న్ బ్రేక్ వేశారు. వెన‌కాలే వ‌స్తున్న ఎమ్మెల్యే వాహ‌నం పోలీస్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే వాహ‌నం బంపర్, ముందు మిర్రర్ పగిలిపోయాయి. అదృష్టావశాత్తు ఎమ్మెల్యే రాజ‌య్య‌కు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story