యూఎస్‌లో మైనర్ లీగ్ టీ20

by Shyam |   ( Updated:2020-06-02 06:29:57.0  )
యూఎస్‌లో మైనర్ లీగ్ టీ20
X

దిశ, స్పోర్ట్స్: అమెరికాలో క్రికెట్ అభివృద్ధి కోసం యూఎస్ఏ క్రికెట్ అసోసియేషన్ ఈ ఏడాది జులై 11 నుంచి మైనర్ లీగ్ టీ20 టోర్నీని నిర్వహించాలని భావించగా, కరోనా కారణంగా షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుతం అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించాయి. దేశీయ విమాన సర్వీసులపైనా ఆంక్షలు ఎత్తివేశాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 22 నుంచి ఈ లీగ్ ప్రారంభించాలని యూఎస్ఏ క్రికెట్ నిర్ణయించింది. దేశంలోని 22 రాష్ట్రాల నుంచి 22 టీమ్‌లు ఈ లీగ్‌లో పాల్గొంటాయి. ప్రతి టీంలో విదేశీ ఆటగాళ్లు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. 60 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌ పోటీల్లో ఆటగాళ్లకు ప్రయాణ భారం లేకుండా చూస్తామనీ, నాకౌట్ దశకు చేరుకునే వరకు అసలు ప్రయాణాలే ఎక్కువ ఉండవని స్పష్టం చేశారు. ఐసీసీ విధించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ టోర్నీ నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, 2021 వేసవి కాలంలో ‘మేజర్ లీగ్ క్రికెట్ టీ20’ నిర్వహించనుండగా, దానికి సన్నాహకంగానే ఈ టోర్నీని జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed