లవర్స్‌ అడ్డగింత..అత్యాచారం

by Shamantha N |
లవర్స్‌ అడ్డగింత..అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు దుండగులు ప్రేమికులను అడ్డగించి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.ఈ హృదయవిదారక ఘటన బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే..16 ఏళ్ల యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆ బాలిక గత వారం రాత్రి సొంత గ్రామానికి యువకుడితో కలిసి బైక్‌పై బయలు దేరింది. మార్గ మధ్యలో మద్యం మత్తులో ఉన్న మృగాళ్లు వారిని అడ్డగించి ఆమె బాయ్ ఫ్రెండ్ ను చితకబాదారు. అతని వద్ద ఉన్న మొబైల్‌, ఇతర వస్తువులను లాక్కున్నారు. అనంతరం బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ రాత్రంతా బాలికపై అత్యాచారం చేసిన దుండగులు తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. అఘాయిత్యం జరిగిన తర్వాత సొంతూరుకు వెళ్లిన బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story