- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సప్త సముద్రాలు ఈదాలని ఆకాంక్షించిన మంత్రి
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి చెందిన గోలి శ్యామల అంతర్జాతీయ స్థాయి వేదికలపై వెటరన్ స్విమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకరావడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. బుధవారం మంత్రిని అంతర్జాతీయ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామల ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత్-శ్రీలంకా దేశాల మధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న పాక్ జలసంధిని ఈది చరిత్ర సృష్టించారన్నారు. ఇదే స్పూర్తితో ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది రాష్ట్రానికి , దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంత్యంత కోల్డ్ వాటర్ కలిగిన, లోతైన కేటాలిన ఐలాండ్ నుంచి లాస్ ఏంజెల్స్ వరకు సుమారు 36 కి.మీ జరిగే స్విమ్మింగ్ అడ్వెంచరస్ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్నందుకు మంత్రి అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఆయుష్ యాదవ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేష్ పాల్గొన్నారు.