- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి : మంత్రి
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: కరోనా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయనియంత్రణ ఎంతో అవసరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న భగీరథ కాలనీలో ఆయన పర్యటించారు. స్థానికులకు భరోసా కల్పించి, తగిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం రవీంద్రనగర్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణంలో పర్యటిస్తూ మెయిన్‌రోడ్ ప్రాంతంలో షాపులను సందర్శించారు. షాపుల యజమానులు తప్పనిసరిగా మస్కులు ధరించాలని, షాపులో శానిటైజర్లు పెట్టాలని వారికి సూచించారు.
Next Story