- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం జిల్లాకు దారి కడుతున్న మంత్రులు
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన ఖరారైంది. ఈ నెల7న ఖమ్మం నియోజకవర్గంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీలు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నలుగురు మంత్రులు పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఖానాపురం మినీ ట్యాంక్ బండ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
అనంతరం రఘునాథపాలెం మండలంలోని బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామాన్ని ప్రారంభిస్తారు. అలాగే పాండు రంగాపురం-కోయచలక క్రాస్ బీటీ రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ ప్రారంభోత్సవం (కోయచలక సర్కిల్ వద్ద), రఘునాధపాలెం-చింతగుర్తి బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం, ఎన్ఎస్పీ కాలువపై నిర్మించిన వాక్ వే, కేఎంసీ పార్క్ ప్రారంభోత్సవం, లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో పీవీ నర్సింహారావు విగ్రహం ఆవిష్కరించనున్నారు.
వీటితో పాటు ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధంసలాపురం ఆర్వోబీ ప్రారంభం, సమీపంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ఆవిష్కరించనున్నారు మంత్రులు. ప్రకాశ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ (ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం చేపట్టనున్నారు. చివరగా ఖమ్మం నడిబొడ్డున నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అనంతరం మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంత్రుల పర్యటనకు భారీగా స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.