- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోం మంత్రికి నెలకు రూ.100 కోట్లు కావాలంట.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీ
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం మహరాష్ట్ర హోంగార్డ్ విభాగానికి డీజీగా ఉన్న పరమ్ బిర్ సింగ్ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇల్లు యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనం ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్,అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ వాజేదని NIA(జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సచిన్ వాజే..నేరుగా మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ కు రిపోర్ట్ చేసేవారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ముంబై పోలీస్ కమిషనర్ గా ఉన్న పరమ్ బిర్ సింగ్ ను హోం గార్డ్ విభాగానికి డీజీగా నియమించింది. ముంబై కొత్త పోలీస్ కమిషనర్ గా హెమంత్ నాగరాలేకు బాధ్యతలు అప్పగిస్తూ మహరాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పరమ్ బిర్ సింగ్ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. అనిల్ దేశ్ ముఖ్ కు నెలకు రూ.100 కోట్లు కావాలంట’ అంటూ చేసిన పరమ్ బిర్ సింగ్ వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.
పరమ్ బిర్ సింగ్ హోం మంత్రి పై చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.
♦ ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ లోని ఇంటెలిజెన్స్ యూనిట్ కు నాయకత్వం వహిస్తున్న సచిన్ వాజేను గత కొన్ని నెలలుగా రాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన అధికారిక నివాసానికి పిలిపించుకున్నారు. అక్కడే వసూళ్ల చేయాలని ఒత్తిడి తెచ్చారు.
♦ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ నెలకు రూ.100కోట్ల నిధుల్ని ఎలా వసూలు చేయాలనేది పక్కా ప్లాన్ ను సచిన్ వాజేకు వివరించారని పరమ్ బిర్ సింగ్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రూ.100కోట్లను మహరాష్ట్రలో ఉన్న 1750 బార్లు, రెస్టారెంట్లలో నెలకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకూ వసూలు చేయొచ్చు. అలా చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50కోట్లకు పైగా వసూలవుతాయి. మిగిలిన మొత్తాన్ని ఇతర పద్దతుల్లో వసూలు చేయొచ్చని దేశ్ ముఖ్ తన నివాసంలో సచిన్ వాజేకు వివరించినట్లు చెప్పారు.
♦ వసూళ్ల వ్యవహారంలో సచిన్ వాజే పై మంత్రి దేశ్ ముఖ్ ఒత్తిడి తెచ్చిన విషయాన్ని.. సచిన్ వాజే నాకు చెప్పారు. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్ధం గాక అలాగే ఉండిపోయినట్లు తెలిపారు.
♦ కొద్దిరోజుల తరువాత ముంబైలోని హుక్కా పార్లర్ల గురించి చర్చలు జరపడానికి హోం మంత్రి తన అధికారిక నివాసంలో ఏసీపీ, సోషల్ సర్వీస్ బ్రాంచ్ సంజయ్ పాటిల్ ను పిలిచారు. ఈ సమావేశంలో ఇతర అధికారులు, హోమంత్రి పీఏ పలాండే పాల్గొన్నారు. ఆ మీటింగ్ తర్వాత హోంమంత్రి పీఏ పలాండే.., పాటిల్ తో పాటు డీసీపీ భుజ్బాల్ ను హోంమంత్రి అధికారిక నివాసానికి పిలిపించారని పరమ్ బిర్ వెల్లడించారు. ఆ సమావేశంలో హోమంత్రి ఎసీపీ పాటిల్, డీసీపీ భుజ్బాల్ కు రూ.100కోట్లను వసూలు చేయాలని ఆదేశించారని, ఆ విషయాన్ని ఏసీపీ పాటిల్ తనకు సమాచారం ఇచ్చినట్లు పరమ్ బిర్ సింగ్ మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో వివరించారు. ప్రస్తుతం పరమ్ బిర్ సింగ్ రాసిన లేఖ మహరాష్ట్ర అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టింది.