సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు

by Shyam |
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
X

దిశ, మెదక్: కొండపోచమ్మ రిజర్వాయర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కళ్లలో ఆనందం చూడటానికే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. కేవలం 18 నెలల్లో కొండపోచమ్మ పంపు హౌస్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. భారతదేశం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు వేయాలని మంత్రి కోరారు.

Advertisement

Next Story