మూగ జీవాల సంరక్షకు చర్యలు

by Shyam |
మూగ జీవాల సంరక్షకు చర్యలు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మూగ జీవాల సంరక్షణ కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రపంచ రేబిస్ డే ను పురస్కరించుకుని వీధి శునకాలకు ఉచిత రేబిస్ వ్యాక్సిన్ పోస్టర్‌ను తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. రేబిస్ రహిత రాష్ట్రాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వీధి శునకాలకు రేబిస్ వ్యాక్సిన్ వేయడం వలన పలు వ్యాధుల బారి నుండి కాపాడవచ్చని అన్నారు. జంతు సంరక్షణకు రాష్ట్ర ఎనిమల్ బోర్డ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story