- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ జాతుల కళ్ళల్లో… ఆనందమే సీఎం లక్ష్యం
దిశ, భువనగిరి: సబ్బండ జాతుల కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి మండలంలోని తీనం చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పట్టణంలోని తీనం చెరువులో 67వేల చేపపిల్లలు వదిలినట్టు తెలిపారు.
వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నింపి సాగు, తాగు నీటి కొరతను తీర్చేందుకు కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీ విషయంలో మరి కొంతమంది గొర్రెల కాపరులు మిగిలి ఉన్నారని, డీడీలు కట్టిన వారికి త్వరలో పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎమ్యెల్యే శేఖర్రెడ్డి మాట్లాడుతూ… పశువుల జాతీయ కృత్తిమ గర్భ ధారణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారితో పాటు జిల్లాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్ తదితర అధికారులు పాల్గొన్నారు.