సినీ పరిశ్రమకు మంచి రోజులు.. జూన్ 1 నుంచి షూటింగ్

by Jakkula Samataha |
సినీ పరిశ్రమకు మంచి రోజులు.. జూన్ 1 నుంచి షూటింగ్
X

కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ భారీ నష్టాన్ని చవిచూసింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.. చిత్రాల విడుదల వాయిదా పడింది.. సినిమా హాళ్లు మూత పడ్డాయి.. మాల్స్ బంద్ అయ్యాయి.. దీంతో ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే రూ. 600 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. అంతే కాదు సినిమా మీద ఆధారపడి బతికే జీవితాలు సైతం అస్తవ్యస్తం కావడం…కూలీలు తిండి గింజలు లేక బాధపడడం జరిగింది. ఐతే ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు భవిష్యత్తులో ఉండబోవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టాలీవుడ్ కు మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపారు. ఇండస్ట్రీ లో నెలకొన్న సమస్యలపై సినీ పెద్దలలో సమావేశమై చర్చించిన ఆయన… అనంతరం ఫిల్మ్ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు.

14 వేల మందిని ఆదుకున్న సిసిసి..

ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరికీ ఇబ్బంది ఉందన్నారు తలసాని. కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సరికొత్త పాలసీలతో ప్రభుత్వం ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమ పై ఆధారపడి బతికే కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపిన తలసాని… కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటుపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సిసిసి … 14 వేల మందిని ఆదుకుందన్నారు. జూన్ 1 నుంచి సినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉందన్న తలసాని… లాక్ డౌన్ ఎత్తేయగానే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని మంచి నిర్ణయం తీసుకుంటాయన్నారు.

Tags : Talasani Srinivas Yadav, Tollywood, lock down, shooting

Advertisement

Next Story

Most Viewed