సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు షురూ.. ఫీల్డ్‌‌లోకి మంత్రి తలసాని

by Shyam |   ( Updated:2021-10-12 00:54:17.0  )
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు షురూ.. ఫీల్డ్‌‌లోకి మంత్రి తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెక్లెస్ రోడ్డులోని కర్బాలా మైదాన్ ఘాట్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం బతుకమ్మ పండుకు ప్రాధాన్యం ఇచ్చి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని అన్నారు. ఈ వేడుకలో వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed