ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు: తలసాని

by Shyam |
ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు: తలసాని
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులు, ఇతర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో 745 ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. సన్న బియ్యంతో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం, వారంలో 3 రోజులు గ్రుడ్లు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ డీఈఓ వెంకటనర్సమ్మ, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఈ రవీందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed