- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌పై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం సనత్‌నగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఆయన GHMC కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ కొలన్ లక్ష్మిబాల్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపిణీ, ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్, మాంసం దుకాణా దారులు, కూరగాయల విక్రయదారులు తదితర చిన్న వ్యాపారుల కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్‌లలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటి వరకు 92 వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 3 వ తేదీ నుండి ఆటో డ్రైవర్‌లకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటుందని, ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నట్లు వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగానే ప్రభుత్వం లాక్ డౌన్‌ను అమలు చేస్తుందని, ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం అనేక చర్యలను తీసుకుంటున్నారని చెప్పారు. అమీర్‌పేటలోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణలో వైద్యులు, నర్స్‌లు, ఆశ వర్కర్ల కృషి ఎనలేనిదని ప్రశంసించారు.