- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జిల్లాలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సోమవారం ఉదయం పట్టణంలోని గోల్ మజీద్ వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా నీటి సరఫరా వాల్ వద్ద ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదని సూచించారు. అనంతరం మహబూబ్‌నగర్ రూరల్ మండలానికి చెందిన నలుగురు కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులకు మంత్రి రూ.4,00,464 చెక్కులను మన్యంకొండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. అలాగే మహబూబ్‌నగర్ రూరల్ మండలం పీఏసీఎస్ కోటకద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులందరూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే రైతులు తమకు సూచించిన సమయంలో పంటలను కొనుగోలు కేంద్రాలను తీసుకువచ్చి సామాజిక దూరాని పాటించాలని తెలిపారు.
Tags : Minister Srinivas Goud, toured, mahaboobnagar, kalyana laxmi chekcks