- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆర్డీఎస్ కాలువ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తారని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆర్డీఎస్ పై జరుగుతున్న కుట్రల గురించి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేశారని మంత్రి చెప్పారు.
ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ నుండి అక్రమంగా నీటిని తరలించే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా చర్యలు తీసుకుంటారు. అందుకు తగిన ఎత్తులకు పై ఎత్తులు వేసి మనకు నష్టం కలగకుండా చూసుకుంటారని మంత్రి చెప్పారు. రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై నిర్మిస్తున్న కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్ లు పూర్తి కావచ్చని మంత్రి తెలిపారు. కృష్ణ నది నుండి మనకు రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు.