- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దాలి: శ్రీనివాస్‌గౌడ్
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు సందర్శకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక స్థలాలు లీజుకు తీసుకున్న సంస్థలు డబ్బులు చెల్లించకుండా కోర్టు స్టేలతో ఆదాయానికి గండి కొడుతున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి, అనంతరం స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, టూరిజం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిల్పారామం ఆర్థిక స్వావలంబన సాధించటానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, కళల పోషణ, సంప్రదాయ చేతి వృత్తుల వస్తువుల అమ్మకాలలు, చేనేత వస్త్రాలు, పోచంపల్లి చీరలు, గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట, కాలంకారి, చేర్యాల పెయింటింగ్స్‌లకు శిల్పారామం కేంద్ర బిందువును చేయాలని అధికారులను తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న మినీ శిల్పారామంలో గ్రామీణ వాతావరణం, సాంప్రదాయాలు, చేతి వృత్తులతో తయారైన వస్తువులు, పిల్లల ఆట కేంద్రాలతో పాటు మానసిక ఉల్లాస కేంద్రాలు, సాంప్రదాయ ఫుడ్ కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.