45లక్షల ఈత, తాటి మొక్కలు నాటాలి

by Shyam |
45లక్షల ఈత, తాటి మొక్కలు నాటాలి
X

దిశ, న్యూస్ బ్యూరో: హరితహారం కార్యక్రమం కోసం ఈ ఏడాది 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ భారీగా తాటి, ఈత మొక్కలను నాటాలన్నారు. రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖపై మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండ్‌పై పత్రికల్లో వచ్చిన ఆరోపణల మీద శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఆబ్కారీ శాఖలో మహిళా ఉద్యోగులకు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే కమిషనర్‌ను సంప్రదించాలన్నారు. రాష్ట్రంలో వైన్ షాపులు ఇకపై రాత్రి 8.30 వరకు తెరచి ఉంచడానికి అనుమతిచ్చామన్నారు. టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను పటిష్ట పరిచేందుకు సమర్ధవంతమైన అధికారులను నియమిస్తామన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్ ఖురేషి, కేఏబీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed