రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెనక్కి పంపొద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

by Shyam |

దిశ, మహబూబ్ నగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వివిధ కారణాలు చూపి రైస్ మిల్లర్లు వెనక్కి పంపించకూడదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ధాన్యంలో రాళ్లు, తాలు ఉండటం సహజమన్నారు. వాటిపైనే దృష్టి పెట్టి ధాన్యాన్ని వెనక్కి పంపడం సరికాదని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల వద్దకే వెళ్లి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు సెంటర్ల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీ డ్రైవర్లు ఎక్కువ డబ్బులను అడుగుతున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ వారి నుంచి అధిక డబ్బులు వసూలు చేయవద్దన్నారు. మిల్లుల వద్ద హమాలీలను ఎక్కువ సంఖ్యలో నియమించుకుని ధాన్యాన్ని సరైన సమయంలో దించాలన్నారు. జిల్లాకు వచ్చే దారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, శాసన సభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: minister srinivas goud, millers don’t send rice to back, meet with millers

Advertisement

Next Story

Most Viewed