అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రులు

by Shyam |
Ministers Srinivas Goud, Dayakar Rao
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : 60వ జాతీయ అథ్లెటిక్ ఓపెన్ చాంపియన్ షిప్ పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పోటీలను బుధ‌వారం క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు కోచ్‌లను ప్రోత్సహిస్తున్నామన్నారు.

Ministers Srinivas Goud, Dayakar Rao

అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 17 మంది క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. అనంతరం మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించడం హర్షణీయమన్నారు. పోటీలకు వరంగల్ నగరంలో మంచి ఏర్పాట్లు చేయడం అభినందనీయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు.

Ministers Srinivas Goud, Dayakar Rao

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 23 రాష్ట్రల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని, 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో జరగడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే నూతనంగా ఏర్పడిన హన్మకొండ జిల్లాను క్రీడా హబ్‌గా ఏర్పాటు కాబోతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఏ స్టాన్లీ జోన్స్, సీనియర్ వైస్ చైర్మన్ అంజూ బాబీ జార్జ్, స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్ రావు, కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్‌వో అశోక్ కుమార్, టీజీవో అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ జగన్మోహన్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed