- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈయనిలా… ఆయనలా..!
దిశ, వెబ్‌డెస్క్: పైన కనపడుతున్న ఫొటోలో ఇద్దరూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న తెలంగాణ మంత్రులు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్న ప్రజాప్రతినిధులు. ఇంట్లోంచి బయటకు ఎవరూ రావద్దు అంటూ హెచ్చరికలు చేస్తూ నియోజకవర్గంలో కలియతిరుగుతున్న నేతలు. దీంట్లో భాగంగానే మనకు మొదట ఫొటోలో ఉన్నది ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తర్వాత విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. ఇద్దరికీ సేమ్ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ వీరిలో ఓ మంత్రి అధికారులు, జనం, పార్టీ నేతలతో గూమికూడి ఉండగా, మరో మంత్రి సోషల్ డిస్టెన్స్‌ను మెయింటేన్ చేస్తూ కనపడుతున్నారు.
ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయల ఇబ్బంది రాకూడదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో తాత్కాలిక రైతుబజార్‌లను ప్రారంభించారు. ఇదే సమయంలో మంత్రితోపాటు అధికారులు, పోలీసులు, పార్టీ నాయకులు అంతా గుమికూడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా దగ్గర దగ్గరగా ఉన్నారు. నిన్నటికి నిన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లాఠీ పట్టుకొని తిరిగి ఎవరూ బయటకు వెళ్లొద్దు, రైతుబజార్లు, సూపర్‌మార్కెట్ల దగ్గర గుంపులుగా ఉండొద్దని వార్నింగ్ ఇచ్చారు. కానీ, తాను కామెంట్స్ చేసి 24 గంటలు గడవక ముందే రైతుబజార్ల వద్ద అధికారులు, జనంతో గుమికూడి ప్రారంభోత్సవం చేశారు. రైతులతో మాట్లాడుతున్న సమయంలో సాక్షాత్తు మంత్రి కూడా ఎలాంటి గ్లౌజులను కూడా పెట్టుకోకపోవడం విశేషం.
అటు సూర్యాపేట జిల్లా హెడ్‌క్వార్టర్‌లో తిరుగుతున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫర్‌ఫెక్ట్‌గా సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నట్లు కనపడుతోంది. మంత్రితో అధికారులు, పోలీసులు ఉన్నా ఖచ్చితంగా రెండు మీటర్ల సోషల్ డిస్టెన్స్‌ను మెయింటేన్ చేస్తూ కనిపించారు. కానీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రైతు బజార్ ప్రారంభోత్సవానికి అధికారులు, పార్టీ నాయకులు సైతం వెళ్లి హడావుడిగా కనిపించగా, అటు మంత్రి జగదీశ్‌రెడ్డి ఎటువంటి ఆడాంబరాలకు పోకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కనపడటం ఇద్దరు మంత్రుల మధ్య వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
కరోనా వైరస్ విజృంభణతో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రైతుబజార్ల సంఖ్యను పెంచి కష్టాలను తీర్చడం ఓకే. కానీ, ఓవైపు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతూనే అందర్నీ వెంట పెట్టుకొని తిరుగుతుండటంతో సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Tags: No Social Distance, Minister Srinivas Goud, Mahabubnagar, Rithu Bazaar, Vegetables, Minister Jagadish Reddy, Suryapet