- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ సాకుతో గొర్రెల ధరలను ఇష్టానుసారంగా పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో చెంగిచెర్ల, జియాగూడ, బోయగూడ మండీలలో లైసెన్స్ మొండెదార్లు (గొర్రెల విక్రయదారులు)తో పాటు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రతో కలిసి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 700లకే మటన్ విక్రయించాలని, అంతకు మించి విక్రయిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసం దుకాణాదారులు మటన్ ధరలను అడ్డగోలుగా పెంచుతున్నట్టు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల కారణంగానే పశుసంవర్ధక శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా, మొండెదారులు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా, గొర్రెలను మాంసం దుకాణాల నిర్వాహకులకు మాత్రమే విక్రయిస్తామని, మద్య దళారులకు విక్రయించబోమని మంత్రికి హామీ ఇచ్చారు.
అయితే తమకు పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యేక పాసులను ఇప్పించాలని కోరారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే గొర్రెల వాహనాలకు ఆటంకం కలగకుండా అనుమతులు ఇప్పించాలని పలువురు మొండెదారులు మంత్రిని కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో తనిఖీ బృందం డిప్యూటీ డైరెక్టర్ వెంకట సుబ్బారావు, డాక్టర్ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, మొండెదారులు గౌలిపుర ప్రకాష్, హోమర్, పి.లక్ష్మణ్, రాజు మల్తూకర్, కమల్ ప్రకాష్, భగీరద్, శ్రీనివాస్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Mutton rates, Lockdown, Animal Husbandry Dept, MInister Talasani