‘ఎన్టీఆర్‌ చుట్టు ఆ పని కోసం ప్రదక్షిణలు చేశా’

by Shyam |
‘ఎన్టీఆర్‌ చుట్టు ఆ పని కోసం ప్రదక్షిణలు చేశా’
X

దిశ, మహబూబాబాద్ : నేను సర్పంచ్ గా పని చేసిన కాలంలో మా గ్రామ అభివృద్ధి కై ఒక్క లక్షరూపాయల కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేశానని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేమరువేసుకున్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పల్లె, పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు దేశానికి తలమానికంగా తయారవుతున్నాయన్నారు.

పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో విలసిల్లుతున్నాయని, స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి నెల, నెల నిధులు అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసిఆర్ అడగకుండానే గ్రామాలకు పల్లె ప్రగతి కోసం రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రతి నెల 369 కోట్ల రూపాయలను ఇస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed