- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోంట్ వర్రీ.. మెరుగైన వైద్యం అందిస్తాం : సత్యవతి రాథోడ్
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బాధితులకు మెరుగైన వైద్యం అదించాలని మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో కరోనా పరిస్థితులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ భీమ్ సాగర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ రాథోడ్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాంటి వసతులు, వనరులు కావాలో సూచిస్తే వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా వైద్యులకు కావాల్సిన పీపీఈ కిట్స్, కనీస సదుపాయాలు కల్పిస్తామని హామినిచ్చారు. పాజిటివ్ నిర్ధారణ జరిగి తమ ఇంట్లోనే ఐసోలేషన్ ఉంటున్న వారికి ప్రభుత్వం ఐసోలేషన్ కిట్స్ అందిస్తుందన్నారు. ఆ కిట్లను బాధితులను సరైన సమయంలో అందేలా చూడాలని అధికారులను కోరారు. ఐసోలేషన్ లో ఉండే వ్యక్తి, అతని కుటుంబంపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వ్యక్తిగత నివేదికలు రూపొందించాలని మంత్రి స్పష్టంచేశారు.