టీ- శాట్ సహకారంతో అంగన్‌వాడీ పాఠాలు

by Shyam |
టీ- శాట్ సహకారంతో అంగన్‌వాడీ పాఠాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దూరదదర్శన్, టీ-శాట్ ద్వారా ఆన్‌లైన్‌లో అంగన్‌వాడీ పాఠాలు చెప్పడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చిన్న పిల్లలకు నీతి కథలు, విజ్ఞాన విషయాలను ఇంటి నుంచే నేర్పించేందుకు ఆన్‌లైన్ విధానం బాగా ఉపయోగపడుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్.. కరోనా వైరస్ నియంత్రణ సమయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్‌వాడీ సరుకులు, ఇతర సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహార కొరతను అధిగమించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అంగన్‌వాడీ పిల్లలకు అందించే మురుకులను మరింత నాణ్యతగా తయారు చేయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. అంగన్‌వాడీ పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు ఇచ్చే పాలు, గుడ్లు, పప్పులు, నిత్యావసర వస్తువులను ఆర్టీసీ కార్గో బస్సులు, ఇతర వాహనాల ద్వారా సాధారణ పరిస్థితుల్లో కంటే లాక్‌డౌన్‌లోనే ఎక్కువ శాతం పంపిణీ జరిగినట్టు తెలిపారు. సమావేశంలో శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, టీఎస్ ఫుడ్స్ ఇన్‌ఛార్జ్ క్రిస్టినా జడ్ చోంగ్తు‌తో పాల్గొన్నారు.

Advertisement

Next Story