- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతరలో మహిళా మంత్రి సందడి
దిశ, వరంగల్: శివరాత్రి సందర్భంగా జిల్లాలోని కురవి వీరభద్రస్వామి జాతరలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ సందడి చేశారు. జాతరకు చేరుకున్న మంత్రి.. స్వామివారి దర్శనం అనంతరం, తన చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్నతనంలో తిరిగిన దుకాణాలను చూసి మురిసిపోయారు. వెంటనే దుకాణంలోకి వెళ్లి గాజులు తొడిగించుకున్నారు. పేలాలు, స్వీట్లు కొన్నారు. కుంకుమ దుకాణంలోకి వెళ్లి కుంకుమ పొట్లం కట్టించుకున్నారు. మనవరాలి కోసం బొమ్మలు కొన్నారు. పీక ఊదుతూ పాత జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. అనంతరం మంత్రి హోదాలో జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా మహబూబాబాద్ వాసులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత, ఆపదలో ఉన్న 18 ఏండ్ల లోపు బాలికల కోసం మహిళా-శిశు సంక్షేమ శాఖ అధికారులు రూపొందించిన అభయ హస్తం 1098 పోస్టర్‌ను విడుదల చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణ హితమైన సంచులను విడుదల చేసి, ప్లాస్టిక్‌ను నివారించాలని కోరారు. కాగా, సత్యవతి మంత్రి అయ్యాక శివరాత్రి సందర్భంగా జాతరకు రావడం ఇదే తొలిసారి.