- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం
దిశ, న్యూస్‌బ్యూరో: గిరిజనులకు అవకాశాలు కల్పించే జీవో నంబర్ 3ని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రివ్యూ పిటిషన్ వేయడానికి సీఎం ఆమోదం తెలిపారని మంత్రి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలను 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేసేందుకు వీలుగా 2000 సంవత్సరంలో ఇచ్చిన జీవో 3ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. జీవో 3 వల్ల గత రెండు దశాబ్దాలుగా ఏజన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి అయ్యారన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు క్షేత్రస్థాయిలో స్థితి గతులను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా గిరిజనుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో మాట్లాడినట్టు తెలిపారు. దామాషా పద్దతి ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లు పెంచడానికి కేంద్రం వద్ద కొట్లాడుతున్న సమయంలో ఈ జీవో 3ని కొట్టివేయం బాధాకరమన్నారు. వెనుకబడి ఉన్న గిరిజనులు మిగలిన వారితో సమానంగా అభివృద్ధి కావాలని అత్యధిక గురుకులాలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం వల్ల మిగిలిన వారితో పోటీ పడేవిధంగా తయారవుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం పాటుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం దీక్షలు చేస్తోందని విమర్శంచారు.