- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరపైకి ఉమ్మడి రాజధాని అంశం.. ప్రాణాలు పోతుంటే పాస్‌లు, పర్మిషన్లు తెస్తారా? : సజ్జల
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్సులను అడ్డుకోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో కూడా ఇలాంటి సమస్య లేదని ఒక్క తెలంగాణలోనే ఇలా చేయడం సరికాదన్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బెడ్ల కోసం ఎక్కడైనా ప్రయత్నిస్తారు.
అలాంటి సమయంలో ఆస్పత్రి లెటర్లు, పాసులు తీసుకురావడం సాధ్యపడకపోవచ్చునని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ గైడ్‌లైన్స్ పాటించడం కష్టమని సజ్జల వెల్లడించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను వదిలేశామని గుర్తుచేశారు. అంబులెన్సుల అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో అధికారులు చర్చిస్తున్నారని, ఆవేశాలకు పోయి ఘర్షణలకు దారి తీసుకోవద్దని సజ్జల సూచించారు. కొవిడ్ రోగుల విషయంలో ప్రభుత్వం సమస్య పెద్దదిగా చేయొద్దని.. కేసీఆర్ సర్కార్ మానవత్వంతో ఆలోచించాలన్నారు.