విద్యార్థుల కోసం కేసీఆర్ అహర్నిషలు కృషి: సబితా

by Shyam |   ( Updated:2020-10-30 05:30:12.0  )
విద్యార్థుల కోసం కేసీఆర్ అహర్నిషలు కృషి: సబితా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిషలు శ్రమిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యారంగాల పై సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సమయంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీవీల ద్వారా విద్యా బోధన సాగుతోందని సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story