కడ్తాల్‌ ‘తీజ్’.. మహిళలతో కలసి స్టెప్పులేసిన ఎమ్మెల్యేలు

by Shyam |
teez
X

దిశ, ఆమనగల్లు :గిరిజన సంస్కృతిక, వైభవానికి ప్రతీకగా తీజ్ పండుగ నిలుస్తుందని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. కడ్తాల్ మండలం గానుగుమర్ల తండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మంత్రితో పాటు రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనిత, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లు పాల్గొని మొలకల బుట్టలు నెత్తిన పెట్టుకుని గిరిజన వేషాధారణలో ఊరేగింపులో పాల్గొన్నారు. తండాలో గిరిజన మహిళలు బుట్టలు నెత్తిన పెట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా భక్తి శ్రద్దలతో పూజించి ఆనందంగా జరుపుకునే పండుగ తీజ్ అని ఆమె వివరించారు. ప్రతి యేటా శ్రావణ మాసంలో ప్రకృతి తమను చల్లగా చూడాలని గిరిజన మహిళలంతా కలిసి తీజ్ పండుగను జరుపుకోవడం గిరిజన సంస్కృతిక వైభవానికి నిదర్శనమని ఆమె చెప్పారు. పూలను, ప్రకృతిని ఆరాధిస్తూ పండుగలు జరుపుకోవడం మన సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నంగా మారాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం తండా వాసులకు మంత్రి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరత్ నాయక్, పిఎసిఎస్చైర్మన్ గంప వెంకటేష్, రైతు అధ్యక్షులు జోగు వీరయ్య, సర్పంచులు తులసీరాం నాయక్, డైరెక్టర్ సేవ్య, హంస, ఎల్ఎన్ రెడ్డి, హరిచంద్ నాయక్, నాయకులు లక్పతి నాయక్, జగన్, లాయక్ అలీ, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story