సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబానికి మంత్రి సబితారెడ్డి సంతాపం

by Shyam |
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబానికి మంత్రి సబితారెడ్డి సంతాపం
X

దిశ, రంగారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధి అల్మాస్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరీశ్, తన భార్య ఇద్దరు పిల్లలతో సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులే వీరి మరణానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ఇతర కుటుంబాలు, అసోసియేషన్ వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, వలస కార్మికులతోపాటు మధ్యతరగతి ప్రజల బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఇంటి కిరాయిలతోపాటు పాఠశాల ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశాలు చేశామన్నారు. విపత్కర సమయంలో పనిలేకపోవడంతో ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు.

Tags: minister sabitha indra reddy, visit almasguda, software engineer house

Advertisement

Next Story

Most Viewed