- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో : బడుగు బలహీనవర్గాల్లో లింగ అసమానతలు రూపుమాపేందుకే రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ.. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో, ఎలిమెంటరీ స్థాయిలో బాలికల నమోదులో వ్యత్యాసాలున్నాయన్నారు. అందుకే కేజీబీవీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 391 కేజీబీవీలుండగా.. మరో 84 కేజీబీవీలు ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం 475 పాఠశాలలో 93 ఇంగ్లీష్, 379 తెలుగు, 3 ఉర్దూ మీడియాల్లో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో మొత్తం 1.10 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
2018-19 విద్యాసంవత్సరంలో 84 స్కూళ్లను కేజీబీవీలుగా అప్గ్రేడ్చేశామని, 2021-22లో 26 కేజీబీవీలను ఇంటర్మీడియట్వరకు అప్గ్రేడ్చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 208 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్చదువులు నిర్వహిస్తున్నామన్నారు. వీటి నిర్వహణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.296 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఎంసెట్‌లో 265 మందికి 225 మంది క్వాలిఫై అవ్వడం సంతోషాన్నిచ్చిందన్నారు. బాలికల ఆరోగ్యం కోసం 15 వస్తువులతో కూడిన కిట్ ను అందిస్తున్నట్లు విద్యాశాఖమంత్రి స్పష్టం చేశారు. పదో తరగతి వరకు ఉన్న కేజీబీవీల్లో 12 మంది టీచింగ్, 12 మంది నాన్‌టీచింగ్, అప్గ్రేడ్చేసిన కాలేజీల్లో 18 మంది టీచింగ్, 13 నాన్‌టీచింగ్, ఒక ఏఎన్ఎం, ఒక పీఈటీని నియమించినట్లు ఆమె చెప్పారు. పాఠశాల బిల్డింగులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం ఆరేళ్లలో రూ. 558 కోట్ల ఖర్చు చేసినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. త్వరలోనే పెండింగ్‌పనులను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా 30 కేజీబీవీల నిర్మాణానికి రూ.105 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో 26 కేజీబీవీలు నిర్మిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.