- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాగున్నాయి.. కానీ,.. : టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లీనరీ ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. పార్టీ ద్విదశాబ్ధి వేడుకల్లో భాగంగా ఈ నెల 25న జరుగనున్న పార్టీ ప్లీనరీ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, సమయం సమీపిస్తున్నందున పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. పార్కింగ్ తదితర వాటిని పరిశీలించారు. అంతకుముందు వివిధ కమిటీల ముఖ్య సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రోజా రంగారావు, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ తోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.