- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కుల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
దిశ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో బుధవారం మాస్క్‌ల విక్రయ కేంద్రాలను కలెక్టర్ కర్ణన్‌తో కలసి మంత్రి అజయ్‌కుమార్ ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఆర్టీసీ బస్ స్టేషన్, గాంధీ చౌక్ సెంటర్లలో మాస్క్ విక్రయకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల తాకిడి ఎక్కువ ఉన్న చోట అందరికీ అందుబాటులో మాస్కులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం రూ.10కి కాటన్ మాస్క్ లు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.