- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెల్లగా పాత పరిస్థితులు వస్తున్నాయి
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం రవాణా కార్యాలయంలో సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రస్తుత కోవిడ్ తరుణంలో రవాణా శాఖలో అనేక మార్పులకు, కొన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. వినియోగదారుడు కార్యాలయానికి రాకుండానే అనేక సేవలు ఇప్పటికే ఆన్లైన్ చేశామన్నారు.
ఇటీవలే జులై 24వ తేదీన మరో 5 సేవలు ఆన్లైన్లో పొందుపరిచామని ఇది వినియోగదారుడికి ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయం సమకూర్చే శాఖలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోవిడ్‌కి ముందు దాదాపు రూ.350 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాగా ప్రస్తుతం అది 300 కోట్ల వారికి వస్తోందన్నారు. అయితే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో చాలా మెరుగుపడ్డామని, పాత పరిస్థితులు మెల్లగా వస్తున్నాయన్నారు.