ఎదుటివారి ప్రాణం తీసినోళ్లం అవుతాం : పువ్వాడ

by Shyam |
ఎదుటివారి ప్రాణం తీసినోళ్లం అవుతాం : పువ్వాడ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రహదారి భద్రత అందరి బాధ్యత అని, విధిగా ప్రతి ఒక్కరూ నిబంధ‌న‌లు పాటించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రాచకొండ సీపీ భగవత్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ అవేర్ నెస్ కార్యక్రమానికి హోం మంత్రి మ‌హ‌మూద్ అలీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహరించాలని కోరారు. రోడ్డు భద్రత ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు అవసరమని, నిర్లక్ష్యం చేస్తే మనతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా తీసిన వారం అవుతామన్నారు. వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed