లాక్‌డౌన్అమలు తీరుపై మంత్రి సమీక్ష : మంత్రి పువ్వాడ అజయ్

by  |

దిశ‌, ఖ‌మ్మం : కరోనా నేపథ్యంలో ఖమ్మం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 29వ డివిజన్ ఖిల్లా బజార్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. ఖిల్లా బజార్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి క‌రోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ వ్యక్తి నివాసముండే ప్రాంతంలో లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు మంత్రి ఖిల్లా బ‌జార్‌లో ప‌ర్య‌టించారు. ఈ ప్రాంతంలో ఉండే ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌ను మంత్రి అజయ్ ఆదేశించారు. అలాగే స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు, కూరగాయల‌ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్వయంగా వైద్య సిబ్బందిచేత థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, పోలీస్ క‌మిష‌న‌ర్ త‌ఫ్సీర్ ఇక్బాల్‌, మునిసిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి , మునిసిప‌ల్‌, రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Tags: carona, minister puvvada ajay kumar, dont worry, people, visit markets

Advertisement

Next Story

Most Viewed