రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత: పువ్వాడ

by Shyam |
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత: పువ్వాడ
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మంత్రి రోడ్డు భద్రత కరపత్రాలను విడుదల చేసి అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ తమవంతుగా కృషి చేస్తుందన్నారు. రోడ్డు భద్రత ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు అవసరమని, నిర్లక్ష్యం తగదన్నారు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్య పర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మాసోత్సవాలు నిర్వహిస్తుస్తోందని చెప్పారు. రోడ్డుపై ప్రయాణం చేసే వారు విధిగా సీటు బెల్ట్‌, హెల్మెట్‌ ధరించాలని, అది మీతో పాటు మీ కుటుంబాన్నీ కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉంటూ.. ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ, నిబంధనలు పాటించాలని కోరారు.

Advertisement

Next Story