- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు అది లేకపోతే నిద్రపట్టదు : మంత్రి పేర్ని నాని
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ వేశారని, దాని ప్రకారమే పట్టాభి చేత అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి పేర్నినాని ఆరోపించారు. చంద్రబాబుకు అధికారం లేకపోతే నిద్రపట్టదని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు, పట్టాభి లాంటి వారితో మాట్లాడిస్తూ చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ను మించిన వారు దేశంలో ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో కూడా చంద్రబాబు దిట్ట అన్నారు.
చంద్రబాబు వయసుకు తగ్గ ఆలోచనలు చేయాలే తప్ప ఇలాంటి ఘటనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కేంద్రమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడితే ఆ వీడియోలు రిలీజ్ చేసి హడావుడి చేసేవారని గుర్తు చేశారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసమే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గతంలో తిరుపతిలో అమిత్ షా పై టీడీపీ నేతలు రాళ్లు వేసిన ఘటనను ఎవరూ మర్చిపోరని మంత్రి పేర్ని నాని అన్నారు.