- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. రైతుల గురించి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, డ్రైనేజీకి చంద్రబాబు నోరుకు తేడా లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు జరిగితే లోకేశ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు.
వయస్సు పైబడి చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందని, కరోనా సమయంలో హైదరాబాద్ బంగ్లాలో దాచుకున్నారని ఫైర్ అయ్యారు. సున్నా వడ్డీ కింద రూ.1,053 కోట్లను సీఎం జగన్ మంజూరు చేశారని అన్నారు. రూ.970 కోట్ల ధాన్యం బకాయిలను చంద్రబాబు చెల్లించలేదని జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాకే చెల్లించిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్నది చంద్రబాబు కాదా ప్రశ్నించారు.