- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరద బాధితులు నినాదాలు.. మంత్రికి నిరసన సెగ
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డికి వరద బాధితుల సెగ తగిలింది. నెల్లూరు జిల్లా సంగెం మండలం కోలగట్లలో మేకపాటి గౌతమ్‍రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల సమయంలో నాయకులు, అధికారులు ఎవరూ రాలేదు. తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని బాధితులు మంత్రిని ప్రశ్నించారు. వరదలు ముగిశాక రావడం ఎందుకంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరద బాధితులు నినాదాలు చేశారు. అయితే మంత్రి మేకపాటి వరద బాధితులతో మాట్లాడారు. ఏం సమస్యలు ఉన్నాయో చెప్పాలని ఆరా తీశారు.
ఆధార్ కార్డు లేని కారణంగా ప్రభుత్వ సాయం అందడం లేదని వరద బాధితులు చెప్పడంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులకు సాయంత్రం కల్లా ప్రభుత్వ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.2000/- ఇతర సరుకులు అందించాలని సంగెం ఎమ్మార్వో నిర్మలానంద బాబాకు ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు త్వరలోనే ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఆధార్ కార్డులు వచ్చేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం కోలగట్లలో ప్రతి ఇంటిని మంత్రి మేకపాటి పరామర్శించారు. వర్షం కురుస్తున్నప్పటికీ.. లెక్క చేయకుండా మంత్రి పర్యటించారు. అనంతరం అప్పారావు పాలెం పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఏ విషయంలోనూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హామీ ఇచ్చారు.