రోశయ్య మృతి పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం

by Sridhar Babu |   ( Updated:2021-12-03 22:54:53.0  )
Roshaiah-1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆర్థిక శాఖకు మంచి పేరును తీసుకోవడంతోపాటు, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా రోశయ్య తన విధులను సమర్థవంతంగా నిర్వహించారని మంత్రి అభిప్రాయపడ్డారు. సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా జీవితాన్ని గడిపిన రోశయ్య లేని లోటు తీరనిది అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రోశయ్య కుటుంబ సభ్యులకు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రోశయ్య మృతి బాధాకరం : శైలజానాథ్

Advertisement

Next Story