- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీసీఐ సీఎండీకి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి కొనుగోళ్లపై సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆంక్షలు ఎత్తివేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీసీఐ సీఎండీకి లేఖ రాశారు. పత్తి కోనుగోలుకు పరిమితి విధిస్తే రైతులు ఇబ్బంది పడే అవకాశముందని, రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని పరిమితిని ఎత్తివేయాలని కోరారు. కొనుగోళ్లపై పరిమితి నిర్దేశించడం సరికాదని, జనవరి నెలాఖరు వరకు ఆంక్షలన్నీంటిని ఎత్తివేయాలని సూచించారు. పంట చేతికొచ్చే సమయంలో ఆంక్షలు విధించడంతో రైతులు మద్దతు ధర దక్కదనే ఆందోళనకు లోనవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కేవలం 100 నుంచి 800 బేళ్లకు మించి కొనుగోలు చేసేది లేదని సీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుందని, మద్దతు ధరలోనూ రూ. 100 కోత విధించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి లేఖలో గుర్తు చేశారు.