- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త చట్టాలతో మార్కెట్లకు నష్టం లేదు :నిరంజన్ రెడ్డి
దిశ ప్రతినిధి, వరంగల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో మార్కెట్లకు ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన నిరంజన్‌రెడ్డికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ భద్రకాళి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో మార్కెట్లకు జరిగే నష్టం ఏమీ లేదని తెలిపారు. మార్కెటింగ్ వ్యవస్థకు అవసరమైతే రూ.400 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లాభసాటి వ్యవసాయంపై శిక్షణను కల్పిస్తామని తెలిపారు.