పవన్ అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతారు : గౌతంరెడ్డి

by srinivas |
పవన్ అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతారు : గౌతంరెడ్డి
X

దిశ, ఏపీబ్యూరో : జనసేన నేత పవన్​కళ్యాణ్​ తూర్పు గోదావరి జిల్లాలో దివిస్​ పరిశ్రమ నెలకొల్పే ప్రాంతానికి వస్తున్నందున ప్రభుత్వం ఆగమేఘాలమీద కంపెనీలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినట్లు చెప్పుకున్నారు. ఇది ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. అసలు దివిస్ ​పరిశ్రమ గురించి పవన్​కల్యాణ్ కు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఏ పరిశ్రమలోనైనా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేననే చట్టాన్ని 19, జూలై 2019లోనే తమ ప్రభుత్వం మొదటి కేబినెట్​లో ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.

అసలు ఆ పరిశ్రమ ఏర్పాటునకు భూములిచ్చింది గతంలో పవన్​భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. తమ ప్రభుత్వం వచ్చాక అక్కడ ప్రజల ఆమోదంతోనే పరిశ్రమ నెలకొల్పాలని సూచించినట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాలుష్యం గురించి, ఆక్వా హేచరీస్​భవితవ్యం గురించి ఓ కమిటీ వేసినట్లు తెలిపారు. అందరి ఆమోదంతోనే పరిశ్రమ కాలుష్య నివారణ కార్యక్రమం చేపట్టేట్లు ఒప్పించిన తర్వాతనే ముందుకెళ్లాలని, అప్పటిదాకా ఒక్క ఇటుక పెట్టరాదని ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవగాహనారాహిత్యంతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడవద్దని పవన్​కు గౌతంరెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed